తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ పక్షాన రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన డాక్టర్ కె.కేశవరావు, కె.ఆర్.సురేశ్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్.సురేష్ రెడ్డి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
నామినేషన్ల గడువు గడిచిన శుక్రవారంతో ముగిసింది. 16న నామినేషన్లను పరిశీలించారు. నేటి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు. కాగా పోటీ అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. ఇరువురి ఏకగ్రీవ ఎన్నికపట్ల పలువురు రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విశేష అనుభవమున్న ఇద్దరు నాయకులు రాజ్యసభలో ఉండడం వల్ల కేంద్ర పరిధిలోని తెలంగాణ సమస్యలకు పరిష్కారం అభిస్తుందని తెలిపారు.