ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతోంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాది అంటూ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు.
బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని ఆమె ధ్వజమెత్తారు. తెల్లవారుజామునే నిద్రలేపి భగవద్గీత చదివి వినిపించే తన తండ్రి ఉగ్రవాది ఎలా అవుతారని నిలదీశారు. ఢిల్లీ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినందుకు మా నాన్న ఉగ్రవాదా? పిల్లలకు నాణ్యమైన విద్య అందించినందుకు ఉగ్రవాదా? విద్యుత్, నీటి సమస్య తీర్చినందుకు ఉగ్రవాదా? అని కేజ్రీవాల్ కూతురు ప్రశ్నల వర్షం కురిపించారు.
మా నాన్న ఎప్పుడూ సామాజిక సేవలో పాల్గొనే వ్యక్తి అని హర్షిత స్పష్టం చేశారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల ప్రచారంలోకి 11 మంది ముఖ్యమంత్రులను, 200 మంది ఎంపీలను ప్రచారంలోకి దించిందని హర్షిత పేర్కొన్నారు.
పవన్ పై పోటీకీ నేను సిద్దం: కేఏ పాల్