telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో చేరిన .. ఆల్కా లంబాపై .. ఆప్ అనర్హత వేటు..

AAP mla met sonia gandhi

ఆల్కా లంబాపై ఆమ్ ఆద్మీ పార్టీ అనర్హత వేటు వేసింది. ఇటీవల ఆప్‌కు రాజీనామా చేసి, ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పీకర్‌ ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ.. తనను రాజీనామాచేయాలని ట్విటర్‌లో అడిగారని, అందుకే తాను రాజీనామా చేస్తున్న విషయాన్ని ట్విటర్‌లోనే చెప్తున్నానని ఆమె పేర్కొన్నారు.

గతంలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే అయిన అల్కా లంబా ప్రకటించారు. గత ఆరేళ్ల ప్రయాణంలో పార్టీలో కొనసాగినందున గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నానని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్‌ పరాజయానికి బాధ్యత తీసుకోవాలని పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను అల్కా బాహాటంగా కోరిన విషయం తెలిసిందే.

Related posts