telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ నేతల తీరుపై సీరియస్ అయిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనే ఇస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్‌ అధ్యక్షతన జరిగిన మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగా రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజా ప్రతినిధులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు.. పాత, కొత్త వాళ్ళను కలుపుకుని ఎన్నికల ప్రచారం చేయాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు. అలిగి ప్రచారం చేయకుండా ఉండొద్దని.. తాము చేయం అని ముందే చెబితే వేరొకరిని పెడతామన్నారు. పదవుల కోసం ఎన్నో ఏళ్ళు ఎదురుచూసిన వాళ్ళుంటారని.. అవకాశాన్ని బట్టి పదవులొస్తాయన్నారు. బీజేపీ చేసింది ఏమిలేదన్న కేటీఆర్‌.. వారి దృష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు.

Related posts