telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిఎఎ పై .. అవసరమైతే లీడ్ తీసుకోని .. జాతీయంగా పోరాడతా.. : కేసీఆర్

is kcr effects national politics

సిఎఎ పై అవసరమైతే నేను లీడ్ తీసుకుంటా అంటున్నారు కేసీఆర్. సీఏఏ అమలు అనేది కరెక్ట్ కాదు. అన్నీ రాష్ట్ర అసెంబ్లీలు వ్యతిరేకతగా చూపిస్తున్నాయి. రాజస్థాన్ సీఎం అడిగితే హైదరాబాద్ లో మాట్లాడదాం అన్నాను. దీని కోసం హైదరాబాద్ లో ముఖ్యమంత్రుల, ముఖ్యులతో మీటింగ్ ఏర్పాటు చేస్తా. 130కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఇది కరెక్ట్ కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారత్ దిగజారిపోతుందని జార్జి సోరెస్ అని చెప్పిన మాటలు చూసి సిగ్గేసింది. జార్జ్ సోరేస్ అనే వ్యక్తి భారత్ ను హిందూ దేశంగా మారుస్తున్నారని హెచ్చరించారు. భారత్ ప్రజల దేశం మత దేశం కాదు.. అది వృథా బ్రాండ్ దేశానికి మంచిది కాదు. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తాం. అనేక సందర్భాల్లో రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. ఇలాంటి చట్టాల విషయాల్లో వ్యతిరేకిస్తాం. డెమొక్రటిక్ గా ఏర్పాటైన ప్రభుత్వం ఇది. ప్రజలందరినీ వ్యతిరేకత వస్తుంటే పట్టించుకోవాలి.

దవాఖానాలో హిందూ.. ముస్లింలు వేరుగా చూస్తారా. సమస్యేదీ లేదన్నట్లు ఇదే పట్టుకుని ఉంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైపోతుంది. ప్రజల దృష్టి మరల్చి చేసే దందా ఇదేనా. హిందూ-ముస్లిం కలిసి బతకడం లేదా. మనోళ్లు గల్ఫ్ లో 25లక్షల మంది ఉన్నారు.. వాళ్లు పొమ్మంటే ఏం చేస్తాం. తెరాస స్పష్టంగా సెక్యూలర్ పార్టీ అని.. ఎక్కడైనా తమ విధివిధానాలను బహిరంగంగా, నిర్భయంగా చెప్పగలదని అన్నారు. ముస్లిం ప్రజలను ఏం పాపం చేశారు. తెలంగాణలో ముస్లిం లేని పట్టణం ఉందా. వాళ్ల మధ్య చిచ్చు పెట్టి ఏం సాధిస్తాం. మీకు చేతులెత్తి దండంపెడతా.జర్నలిస్టులు దానికి సహకరించకండి. ఈ దేశానికి ఎప్పుడైనా ఫెడరల్ విధానమే శ్రీరామ రక్ష. కర్రపెత్తనాలు పనికి రావు. మహామహులు ఓడిపోవడం లాంటివి చూశాం. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్లే ఓడిపోయారు. ఇది ప్రజల దయ. వాళ్లకు నచ్చితే ఉంచుకుంటారు. లేదంటే తీసేస్తారు. ఈ దేశానికి పూర్తి స్థాయి ఫెడరల్ పార్టీ కానీ, ఇలాంటి విధానం ఉన్న పార్టీనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది. రెండు జాతీయ పార్టీలు(కాంగ్రెస్, బీజేపీ) పూర్తిగా ఫెయిలయ్యాయి అన్నారు కేసీఆర్.

Related posts