telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

దసరాకి రానున్న ఆర్ఆర్ఆర్?

RRR

దేశం మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కూడా తప్పకుండా ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ప్రేక్షకుల్లో తెలియని ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. ఈ ఫీలింగ్‌ను ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు మరింత ఎక్కువ చేశాయి. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే నేడు ఈ సినిమాను మనం చూస్తుండేవాళ్లం. అలనాడు దర్శకుడు రాజమౌళి 2021 జనవరి 8న విడుదల చేయనున్నట్లు ఓ ప్రచార చిత్రం ద్వారా తెలిపారు. కాని కొన్ని అనివార్య కారణాల కారణంగా సినిమా ఆలస్యం అవుతోంది. ఈ సినిమాలో యంగ్‌టైగర్ ఎన్‌టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తున్నారు. వీరి పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన సినిమా టీజర్లు కూడా భారీ స్థాయి ఆదరణ పొందాయి. కొమరం భీమ్ ఏకంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు  ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా నిజానికి ఈ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దాంతో చిత్ర బృందం ఈ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చూస్తుందని సమాచారం.

Related posts