telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డిసెంబర్ నుంచి గోపీచంద్ “అలిమేలుమంగ వేంకటరమణ” ప్రారంభం

gopichand

మాచో హీరో గోపీచంద్ దర్శకుడు సంపత్ నంది సినిమా తరువాత… తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో గోపిచంద్ కు జోడిగా నటించే హీరోయిన్ స్థానంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే జయం, నిజం’ సినిమాలతో విలన్ గా గోపీచంద్ కు హిట్ ఇచ్చిన తేజ ఈ సారి హీరోగా సూపర్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో “సీటిమార్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు గోపిచంద్. ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఆశలన్నీ “సీటిమార్” సినిమా మీదే పెట్టుకున్నాడు.

Related posts