telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హృతిక్ రోషన్ మరదలి ఇంట్లో కరోనా…

Hrithik-Roshan

బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ముందుగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడింది. తరువాత బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరీమ్ మోరాని ఫ్యామిలీ కరోనా బారిన పడింది. ఇప్పుడు తాజాగా నటుడు సంజయ్‌ఖాన్ కూతురు, హృతిక్ రోషన్ మాజీ భార్య సుజేఖాన్‌ సోదరి ఫరాఖాన్ అలీ నివాసంలో కరోనా కలకలం చెలరేగింది. ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు తన కుటుంబ సభ్యులు కోవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నారని ఫరాఖాన్ అలీ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తామంతా క్వారంటైన్‌లో ఉన్నామన్నారు. మరోవైపు ఎందరో నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా మెసేజులు పెడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటివరకు 11వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 400కు చేరుకుంది. అత్యధికంగా మహరాష్ట్రలో కరోనా కేసులు నమోదువుతున్నాయి.

Related posts