telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

16ఏళ్ల బాలిక గ్రెటా .. నోబెల్‌ బహుమతికి నామినేట్‌ ..

16 yrs greta nominated for nobel price

స్వీడన్‌కు చెందిన 16ఏళ్ల బాలిక నోబెల్‌ బహుమతికి నామినేట్‌ అయ్యి చరిత్ర సృష్టించింది. పర్యావరణ మార్పులపై తన ప్రసంగాలతో యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించి పర్యావరణ ఉద్యమకారిణిగా గుర్తింపు పొందిన స్వీడన్‌ బాలిక గ్రెటా థంబెర్గ్‌ను ఈసారి ప్రతిష్టాత్మక పురస్కారానికి నామినేట్‌ చేశారు. దీనిపై గెట్రా థంబెర్గ్‌ స్పందించింది. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

గత నెల పర్యావరణ మార్పులపై చర్య తీసుకోవాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీకి గ్రెటా ఓ వీడియో సందేశాన్నా కూడా పంపింది. ఆ సందేశంలో పర్యావరణ మార్పులపై కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా కార్యాచరణ మొదలు పెట్టాలని మోడీకి సూచించింది. 2018 టైమ్స్‌ అత్యంత ప్రభావిత చిన్నారుల జాబితాలో గెట్రాకు చోటుదక్కింది.

16 yrs greta nominated for nobel pricepపర్యావరణ మార్పులపై నాయకులు స్పందించాలంటూ 2018 ఆగస్టులో స్వీడిష్‌ పార్లమెంటు ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కూడా చేపట్టంది. పర్యావరణ మార్పులై నాయకులు చర్యలు తీసుకునేలా విద్యార్థులంతా పోరాడాలని పిలుపునిచ్చింది. అలాగే గత డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పులపై అద్భుతమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది.

Related posts