telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ సమ్మె : .. రేపు అధికారులతో .. మరోసారి భేటీ కానున్న కేసీఆర్..

KCR cm telangana

సీఎం కేసిఆర్ సమ్మెపై నేరుగా రంగంలోకి దిగనున్నారు. సమ్మె పరిణామాలు, కార్మికుల డిమాండ్లపై సీఎం ఆధ్యర్యంలో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. దసరా సీజన్ కావడంతో ఓ వైపు ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు వారితో చర్చలకు దిగింది. ఇక కార్మికులు సైతం సమ్మెను ఉధృతం చేసేందుకు ఇతర సంఘాల మద్దతు కోరుతున్నారు. ఇందుకోసం ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. పండగకు రెండు రోజుల ముందు బస్సులు బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న ప్రజలు ప్రభుత్వం తీసుకునే చర్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. సమస్యను అధికారులకు వదిలిపెట్టి ముఖ్యమంత్రితో మంత్రులు సైతం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. కనీసం కార్మికులతో సంబంధిత మంత్రి కూడ వారితో చర్చలు జరపలేని పరిస్థితిలో వ్యవహరించారు.

శనివారం సాయంత్రం 6 గంటల వరకు విధుల్లోకి చేరాలని డెడ్‌లైన్ విధించింది ప్రభుత్వం. ఆ డెడ్‌లైన్‌ను లెక్క చేయని కార్మికులు సమ్మెను కొనసాగించేందుకే నిర్ణయించారు. ప్రభుత్వ చర్యలతో కార్మికులు తమ సమ్మెను ఉదృతం చేసేందుకు సన్నద్దమయ్యారు. వారితో చర్చలు జరపడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం ప్రభుత్వం చేస్తోంది. కార్మికులు దిగిరాకపోతే తాత్కలిక పద్దతిన నియమించిన డ్రైవర్లు, కండక్టర్లను రంగంలోకి దింపాలని భావిస్తోంది. బస్సులపై కార్మికులు దాడులు చేస్తుండడంతో అందుకు అనుగుణంగా భద్రత కల్పించేందుకే సీఎం కేసిఆర్ పోలీసులను అదేశించనున్నారు. ఇందుకోసమే రేపటి సమావేశంలో పోలీసు అధికారులు సైతం హజరుకానున్నట్టు తెలుస్తోంది.

Related posts