వెంకీ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేసిన సినిమా రంగ్ దే. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా నుండి తాజాగా మరో పాట విడుదల కానుంది .”చూసి నేర్చుకో ” అంటూ సాగె ఈ పాట ఈ సినిమాలోని నితిన్ ఆటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పుంది అని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమా హోళీ సందర్బంగా మార్చి 26న అభిమానుల ముందుకు రానుంది. దాంతో చిత్రబృందం ఇప్పుడు ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. గత నెలలో నితిన్ హీరోగా నటించిన చెక్ నిన్న విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో అభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో నితిన్ అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో అనేది.
previous post