telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మండుతున్న సూర్యుడి వీడియో చూశారా… భగభగ మండే అగ్నిగోళం మొదటి చిత్రం…?

Sun

వినీలాకాశంలో తళతళలాడే నక్షత్రాల గురించి తెలుసుకోవాలని ఎవరికీ మాత్రం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. అంతేకాదు మనం చంద్రుడు, ఇతర గ్రహాలు ఎలా ఉంటాయో ఇప్పటికే నాసా ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ భగ భగ మండే సూర్యుడు మాత్రం ఎలా ఉంటాడో ఇప్పటి వరకూ మనం చూడలేదు. అసలు సూర్యుడిని చూడగలమా అనే సందేహం కూడా కలిగింది. ఎందుకంటే భగభగమండే ఆ అగ్నిగోళం దరి దాపుల్లోకి వెళ్లాలంటే మాటలు కాదు. అందుకే ఇప్పటివరకూ ఎలాంటి ప్రయత్నమూ చేయలేక పోయాయి పరిశోధనా సంస్థలు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదైన సోలార్ టెలీస్కోప్ సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన తొలి చిత్రాన్ని తీసింది. నిజానికి మన సూర్యుడికి సంబంధించిన మొదటి చిత్రం ఇదే. దాదాపు కొన్ని వేళ్ల మైళ్ల నుంచి ఈ ఫొటో తీసినట్టు సమాచారం. అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్‌ఎస్‌ఎఫ్) సంస్థ తమ పరిశోధనలో భాగంగా సూర్యుడి ఉపరితలం ఫొటోలు, వీడియోలను తీసింది. వీటిల్లో సూర్యుడు భగభగ మండుతూ.. బంగారు వర్ణంలో కనిపించాడు. ఈ ఫొటోలను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts