telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి వెళ్ళేందుకు స్టీఫెన్ రవీంద్రకు క్లియరెన్స్!

IT Grid Case fast Stephen Ravindra SIT

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ కి కేంద్ర హోంశాఖ అనుమతించింది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన లేఖ తెలంగాణ ప్రభుత్వానికి అందనుంది. అనంతరం స్టీఫెన్ రవీంద్రను ఏపీకి డిప్యుటేషన్ కింద పంపుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ తర్వాత ఏపీలో ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. గత రెండు నెలల నుంచి స్టీఫెన్ రవీంద్ర సెలవులో ఉన్నారు.

Related posts