మంగళూరు నేత్రావతి నదీ తీరంలో కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థసిద్ధార్థ మృతదేహం లభించింది. ఈ క్రమంలో ఆ నదిలోకి దూకి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయపు పన్ను విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది.
సిద్ధార్థ్ మృతి పట్ల రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘వీవీ సిద్ధార్థ్ ఆత్మహత్యకు పాల్పడిన వార్తతో షాక్ కు గురయ్యాను. ఎంతో బాధగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం కలిగింది. ఆయన ఒక జెంటిల్మెన్, సౌమ్యుడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, కాఫీ డే సిబ్బంది నిబ్బరంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు: బాలినేని