telugu navyamedia
రాజకీయ వార్తలు

బొగ్గుగనుల వేలానికి .. సిద్దమైన కేంద్రం.. ఒక్కసారే 41..

coal mine auction soon by central govt

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి త్వరలోనే దేశవ్యాప్తంగా 41 బొగ్గు గనులకు వేలం నిర్వహించనున్నట్లు పార్లమెంట్‌లో వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న అంశాలు తుదిదశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు వినియోగానికి సంబంధించిన వివరాలను పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2018-19లో భారతీయ రైల్వే మొత్తంగా 1,223.29 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందన్నారు.

అందులో సగానికి పైగా అంటే 605 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసిందని తెలిపారు. బొగ్గు రవాణా, సరఫరా విషయాలను ఎప్పటికప్పుడు బొగ్గు, విద్యుత్ శాఖ కార్యదర్శులు వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. ఇక తెలంగాణలో మరో ఐదేళ్లలో 11 ఓపెన్ కాస్ట్, ఒక అండర్‌గ్రౌండ్ మైన్ ఏర్పాటు చేయాలని బొగ్గుగనుల సంస్థ యోచిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆ సంస్థ పలు చర్యలు చేపట్టిందని ప్రహ్లాద్ జోషి చెప్పారు.

Related posts