telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. పది గంటలకు శాసన మండలి భేటీ కానుంది. తొలి రోజునే ఉభయ సభల ఆమోదానికి రానున్నాయి వివిధ శాఖలకు చెందిన ఆర్డినెన్సులు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు మాజీ ప్రజా ప్రతినిధుల మృతికి సంతాపం తెలపనున్నాయి ఉభయ సభలు. బీఏసీ సమావేశంలో పని దినాలను ఖరారు చేయనున్నారు అసెంబ్లీ స్పీకర్. ప్రశ్నోత్తరాలు లేకుండానే ఉభయ సభలను నడపాలని భావిస్తోంది ప్రభుత్వం. ప్రశ్నోత్తరాలు ఉండి తీరాల్సిందేనంటోన్న ప్రతిపక్షం వాదిస్తోంది. ఇవాళ ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సభకు రానున్నారు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మీడియా పాయింట్ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. అటు అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరగాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఏపీ రాజకీయాలు కూడా వేడెక్కాయి. 

Related posts