telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“హిట్‌” సీక్వెల్‌ వచ్చేసింది… విశ్వక్‌ సేన్‌ కాకుండా మరో హీరో

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన సినిమా “హిట్”. ఈ సినిమా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ సినిమాతో శైలేష్ కొలను దర్శకుడుగా పరిచయం అయ్యాడు. విడుదలైన మొదటి రోజు నుండే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘హిట్‌’ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. పోలీస్ డ్రామాగా రూపొందిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు హీరోగా న‌టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో న్యూస్‌ వైరల్‌ అయింది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రాబోతుందని టాక్‌. ఇందులో హీరోగా మాత్రం విశ్వక్‌ సేన్‌ను పక్కకు పెట్టనున్నారట. విశ్వక్‌ ప్లేస్‌లో అడవి శేష్‌ కథానాయకుడిగా నటించబోతున్నాడు. మార్చిలో సెట్స్‌ మీదకు వెళ్లే ఈ సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను సీక్వెల్‌ను కూడా డైరెక్ట్‌ చేయబోతున్నాడు. అయితే.. దీనిపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

Related posts