telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

మరో అల్పపీడనం..భారీ వర్షాలు

will be huge rains in 2 telugu states

ఈ ఏడాది వర్షాలు వదలడం లేదు. ఇప్పటికే ఏపీ, చెన్నైని వర్షాలు ముంచెత్తాయి. తాజాగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. డిసెంబర్‌ 1 నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. 2 న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తుగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. నివర్‌ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం చెన్నైకి రానుంది. నివర్‌ తుఫాను తీరం దాటి నాలుగు రోజులు అవుతున్నా.. చెన్నై శివార్లలోని అనే లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షపు నీరు చేరి ఉంది. ఈ నేపథ్యంలో ఆగ్నేయ బంగాళఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రకృతమైన ఈ అల్పపీడనం నిన్న మరింత బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండగా మారనుంది. దీని ప్రభావంతో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 3 వరకు దక్షిణ తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో నివర్‌ తుఫాన్‌తో భారీగా నష్టపోయిన అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు.

Related posts