telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గద్దలకొండ గణేష్ : డిలేటెడ్ ఎమోషనల్ సీన్

Valmiki

వరుణ్ తేజ్‌, అథ‌ర్వ ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం గ‌ద్ద‌లకొండ గ‌ణేష్‌. ప్ర‌స్తుతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న గ‌ద్ద‌లకొండ గ‌ణేష్ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ‌కి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అథ‌ర్వ‌కి జంట‌గా మృణాలినీ రవి న‌టించింది. సినీ సెల‌బ్రిటీలు చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిరంజీవి, మ‌హేష్‌బాబుతో పాటు ప‌లువురు స్టార్స్ వరుణ్ న‌ట‌నపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. కెరీర్‌లో తొలిసారి పవర్ ఫుల్ రోల్ చేసిన వరుణ్ తేజ‌కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. తాజాగా చిత్రం నుండి ఎమోష‌న‌ల్ డిలీటెడ్ సీన్ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో పూజా ఊరు వ‌దిలి పారిపోదామ‌ని వ‌రుణ్‌ని బ్ర‌తిమిలాడుతుండ‌గా, ఆయ‌న ఊరు వ‌దిలి వెళ్ళేదే లేదంటూ ఖ‌రాఖండీగా చెబుతుంటాడు. ఈ ఎమోష‌న‌ల్ సీన్‌ని చిత్రం నుండి తొల‌గించిన చిత్ర బృందం రీసెంట్‌గా యూట్యూబ్‌లో విడుద‌ల చేసింది. ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మీరు కూడా ఈ సన్నివేశాన్ని వీక్షించండి.

Related posts