telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

దిశ చట్టం ప్రకారం.. తక్షణ చర్యలకు ఉపక్రమిస్తున్నాం.. : డీజీపీ గౌతమ్

apcm jagan give full powers to gowtam as dgp

రాష్ట్రంలో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే దిశ చట్టం ఉద్దేశమని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. దిశ చట్టం అమలుపై జిల్లా ఎస్పీలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ… ఈ చట్టంతో వేగంగా కేసు దర్యాప్తు జరపడంతో పాటు నిందితులను తక్షణమే అరెస్టు చేస్తామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదికలు ఇచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు.

నిర్ణీత సమయంలో వయసు నిర్ధరణ, పోస్టుమార్టం, అన్ని రకాల మెడికల్‌ రిపోర్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను పటిష్టం చేయడంతో పాటు విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో స్పెషల్‌ కోర్టులు ఏర్పాటుచేయనున్నట్లు డీజీపీ చెప్పారు.

Related posts