telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తల్లీకూతురిని శాశ్వతంగా విడదీసిన బికినీ ఫోటోలు

Shadow

భర్త నుంచి విడిపోయిన యూఏస్‌కు చెందిన బెథానీ వియెర్రా అనే మహిళకు నాలుగేళ్ల జీనా అనే కూతురు ఉంది. ఆమె భర్తతో విడాకులు తీసుకున్న సమయంలో కూతురును తల్లి వద్ద ఉంచాలని కోర్టు తీర్పునిచ్చింది. తండ్రి మాత్రం తన కూతురిని తన దగ్గరకు తెచ్చుకోవడానికి ఓ పన్నాగం పన్నాడు. అతడు తన భార్యకు సంబంధించిన బికినీ, యోగా ప్యాంట్లలో దిగిన పాత ఫొటోలను కోర్టు ముందు ఉంచాడు. ఇలా అసభ్యంగా ఉంటున్న మాజీ భార్య వద్ద తన కూతురు ఉండడం మంచిదికాదని తన తరఫు న్యాయవాదితో చెప్పించాడు. వాటిని చూసిన న్యాయస్థానం కూతురును తండ్రికి అప్పగించాలని ఆదేశించింది. అయితే వియెర్రా ఆ ఫొటోలు ఇక్కడవి కావని యూఏస్‌లో ఉన్నప్పుడు దిగినవని, మాజీ భర్త వాటిని సోషల్ మీడియా ఖాతాల నుంచి దొంగలించి ఇలా వాడుతున్నాడని కోర్టు ముందు చెప్పినప్పటికీ సౌదీ అరేబియా న్యాయస్థానం మాత్రం తనకు సాక్ష్యాలు మాత్రమే కావాలంటూ భర్తకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమె పాశ్చాత్య పొకడలను అనుసరించడంతో పాటు వ్యాపారవేత్త అయినందున తన బిడ్డను పెంచడానికి ఆమె అనర్హురాలనే తండ్రి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అతడికి అనుకూలమైన తీర్పును వెల్లడించింది. ఇక సౌదీ చట్ట ప్రకారం భార్యభర్తలు విడిపోయినప్పడు తల్లులకు సాధారణంగా 9 సంవత్సరాల వయస్సు వరకు కుమారులను, 7 సంవత్సరాల వరకు కుమార్తెల బాధ్యత ఇవ్వబడుతుంది. తండ్రులు ఆ కాలంలో పిల్లలకు చట్టపరమైన సంరక్షకులుగా ఉంటారు.

Related posts