telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ ను సహాయం అడిగిన బ్రహ్మాజీ

Brahmaji

కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. లాక్ డౌన్ సమయంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ ఏ సమస్య వచ్చిన ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాడు.. అయితే సోనూసూద్ ని కొందరు వింత కోరికలు కూడా కోరుతున్నారు. దీనిపైన సోనూసూద్ కూడా తనదైన స్టైల్ లో స్పందిస్తున్నాడు. అందులో భాగంగానే నటుడు బ్రహ్మాజీ కూడా సోనూసూద్ కి ఓ ఫన్నీ రిక్వెస్ట్ పెట్టాడు. ట్విట్టర్ వేదికగా బ్రహ్మాజీ…స్పందిస్తూ.. ‘డియర్‌ సూపర్‌మ్యాన్‌ సోనూ భాయ్‌.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. మెంటల్‌గా లాక్‌డౌన్‌ అయ్యాను. హైదరాబాద్‌లో చిక్కుకుపోయాను. ప్లీజ్‌ నన్ను ఇక్కడకు తీసుకెళ్లు. క్రొయేషియా’ అంటూ ట్వీట్ చేశాడు బ్రహ్మాజీ. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపైన సోనుసూద్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Related posts