తెలంగాణ పట్టభద్రతుల ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. అటు పల్లా, ఇటు పీవీ కూతురు సురభివాణీ ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. ఈ విజయంతో టీఆర్‌ఎస్ భవన్‌లో నిన్న కార్యకర్తలు, కీలక నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇది ఇలా ఉండగా… తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న…అలీయాస్ నవీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఎందుకంటే.. నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓట్లు సాధించి… అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చుక్కలు చూపించారు తీన్మార్ మల్లన్న. చివరి వరకు పోరాడినా మల్లన్నకు ఓటమి తప్పలేదు. అయితే.. మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకలపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం ఆదివారం ఉదయం పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందాడు. ఇక ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి శ్రీశైలం మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. శ్రీశైలం ఆత్మహత్య విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు.
previous post
next post
నా ప్రకటనలను అతనే నియంత్రించాడు… “గురూజీ” అంటూ పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు