telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవితో బాలీవుడ్‌ బ్యూటీ రొమాన్స్‌ ?

ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒకవైపు ఆచార్య సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను ప్రకటించి అందరని ఔరా అనిపించాడు. అయితే చిరు వరుస సినిమాలు ప్రకటిస్తున్నాప్పటికీ అందులో హీరోయిన్లు దొరకడం కష్టం అయిపోయింది. హీరోయిన్ల విషయంలో చిత్ర టీం తెగ కష్ట పడుతోంది. అయితే ఇటీవల దర్శకుడిని ఓకే చేసుకున్న మెగాస్టార్ లూసిఫర్ సినిమా ఇప్పుడు హీరోయిన్ వేటలో పడింది. అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్ పాత్ర లేదంట. కానీ తెలుగు నెగిటివిటీకి అనువుగా మారుస్తూ దర్శకుడు మోహన్‌ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను జోడించారంట. అంతేకాకుండా హీరోయిన్ పాత్రను కేవలం పాటల వరకు పాత్రమే పరిమితం చేస్తారా లేక సీన్స్‌లో కూడా ఉంచుతారా అనేది తేలాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కూడా ఎవరు చేస్తారన్నది తెలియదు. మొన్నటి వరకు హీరోయిన్‌గా శృతిహాసన్‌ లేదా రకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్‌ వినిపించింది. కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా చేరిందని సమాచారం.

Related posts