telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ లో కాంగ్రెస్ మేనిఫెస్టో .. విడుదల.. నిరుద్యోగ భృతి..

congress-logo

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ..ప్రశాంత్ కిశోర్ సలహాలతో ఓటర్లకు భారీగా వరాలకు కురిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారంలో దుమ్మురేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ..రెండు రూపాయిలకే కేజీ గోధుమ పిండి, మహిళా విద్యార్థినిలకు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు సైకిళ్లు..ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటివి ప్రకటించారు. తాజాగా నేడు(ఆదివారం) కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.

డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులు రూ. 5 వేలు..పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులకు రూ. 7, 500 చొప్పున..నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇక పేద కుటుంబాలకు నెలకు రూ. 6 వేలు ఆర్దిక సాయం..నర్సరీ టూ పీహెచ్‌డీ ఫ్రీ ఎడ్యుకేషన్ వంటి స్కీమ్స్‌ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేసిన ‘న్యాయ్ స్కీమ్’ను..తమను గెలపిస్తే ఢిల్లీలో అమలు చేస్తామని కాంగ్రెస్ హామి ఇస్తోంది. ఈ స్కీమ్ ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు నెలకు రూ.6 వేల లెక్కన సంవత్సరానికి రూ.72 వేల ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 8న జరగనున్నాయి.

Related posts