telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విదేశీ టీకాలకు అనుమతులు ఇస్తున్న భారత్…

Corona

మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ చాలా వేగంగా కొనసాగుతుంది. దాంతో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడుతుంది. అయితే దానిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. భారత్‌ లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, బ్రిటన్‌ ఎంహెచ్‌ఆర్‌ఏ, పీఎండీఏ జపాన్‌ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. విదేశాల్లో అనుమతి పొందిన వ్యాక్సిన్‌ లకు అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్‌లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ముందుగా 100 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇచ్చి ఫలితాలపై వారం పాటు విశ్లేషణలు జరపనున్నారు. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Related posts