టీమిండియా యువ బ్యాట్స్‌మన్, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ ఇదే జోరు కొనసాగిస్తే ప్రపంచ దిగ్గజ వికెట్ కీపర్లు మహేంద్ర సింగ్ ధోనీ, ఆడం గిల్‌క్రిస్ట్‌లను అధిగిమిస్తాడన్నాడు. ఇటీవల పంత్ అన్ని ఫార్మాట్లలో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పంత్ వరుసగా హాఫ్ సెంచరీలు బాదాడు. మూడో వన్డేలోనూ పంత్ దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ మాట్లాడుతూ రిషభ్ పంత్‌ను కొనియాడాడు. ‘టీమిండియాకు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో దూకుడు తీసుకొచ్చింది రిషభ్‌పంత్. అతని వల్లే టీమిండియా రన్‌రేట్ పెరిగింది. పంత్‌ని కొద్దికాలంగా ఫాలో అవుతున్నా. భిన్న స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా పరుగులు చేస్తున్న తీరు అమోఘం. అతను ఆడే విధానం, పరుగులు చేసే తీరు.. గత 30 ఏళ్లలో నేను ఇద్దరిలోనే చూశాను. వాళ్లే ధోనీ, గిల్‌క్రిస్ట్. ఈ ఇద్దరు వికెట్‌కీపర్లూ మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సమర్థులు. పంత్ ఇలాగే కొనసాగితే వాళ్లిద్దర్నీ అధిగమిస్తాడు. తాజా మ్యాచ్‌లో పంత్ అద్బుతంగా ఆడాడు. పాండ్యాతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ తొమ్మిదన్నర ఓవర్లలోనే ధాటిగా ఆడుతూ భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.’అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.
previous post
next post
ఐఏఎస్ లు ముఖ్య పాత్ర నిర్వహించాలి: నితిన్ గడ్కరీ