telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో ఒక్క వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా లేదు: మంత్రి ఈటల

Etala Rajender

కరోనా కట్టడికి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ఈటెల రాజేందర్‌ సందర్శించారు.గచ్చిబౌలిలో 1500 మందికి క్వారంటైన్‌ చేసేలా ఏర్పాటు చేశాం. 15 రోజుల్లోగా 1500 మందికి సరిపడా ఐసోలేషన్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఒక్క వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా లేదని స్పష్టం చేశారు.

ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని ప్రసార మాధ్యమాలను కోరుతున్నా. కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షలు జరిపారు. కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాపించింది. గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్‌ హాస్పిటల్‌ను కరోనా పేషెంట్ల కోసం కేటాయించాం. సైకోలు, శాడిస్టులు పెట్టే అసత్యవార్తలను నమ్మొద్దని మంత్రి కోరారు.హైదరాబాద్‌లో రెడ్‌ జోన్లు లేవని, హైదరాబాద్‌లో రెడ్‌ జోన్లు ఉన్నాయన్న వార్తలు అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.

Related posts