అరుణ్ కుమార్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వెళ్లే ఇతడు హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు చాలాసార్లు ఈ-చలాన్ విధించారు. ఇలా అయితే కష్టమని.. పోలీస్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు బైక్‌పై వెళ్లేటప్పుడు ‘హాఫ్ హెల్మెట్’ (ప్లాస్టిక్ క్యాప్ మాదిరిది) ధరించసాగాడు. తాను హెల్మెట్ ధరిస్తున్నందున చలాన్ రాదనుకున్నాడు. ఓసారి ట్రాఫిక్ పోలీసులు అరుణ్ బైక్ ఆపి తనిఖీ చేయగా.. హెల్మెట్ ధరించడం లేదంటూ పదుల సంఖ్యలో ఈ-చలాన్లు చేతికివ్వడంతో షాక్ తిన్నాడు.
శంషాబాద్‌లో నివాసముండే శివాజీ మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వచ్చి వెళుతుంటాడు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో హెల్మెట్ ధరించని కారణంగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తలకు హెల్మెట్ పెట్టుకునేందుకు ఇష్టపడని శివాజీ.. ‘కన్‌స్ట్రక్షన్ హెల్మెట్’ (ప్లాస్టిక్ క్యాప్)ను ధరించసాగాడు. అయినా శివాజీకి ‘వితవుట్ హెల్మెట్’ అని ఈ-చలాన్‌లు జారీ అవుతుండడంతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా.. హాఫ్ హెల్మెట్ క్యాప్‌గా పరిగణిస్తామని షాకిచ్చారు.
దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు: విజయసాయిరెడ్డి