telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీకి రెండు రాజధానులు.. జమ్మూకశ్మీర్ మాదిరి.. వేసవికి ఒకటి, చలికాలం ఒకటి.. !

TG Venkatesh MP

ఏపీ రాజధానిపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రెండు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటున్న టీజీ.. రాయలసీమలో శీతాకాల లేదా వేసవి రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ తరహాలో కాలానికి అనుగుణంగా ఏపీలో రెండు రాజధానులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా సీమ వాసులు వీటి కోసం పోరాటం చేస్తున్నారని టీజీ చెప్పారు. సీమవాసులు సున్నిత మనస్కులని, వారి భావోద్వేగాలతో కూడిన అంశాలపై సీఎం జగన్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని టీజీ కోరారు. లేదంటే యువత ఉద్వేగాలకు లోనై ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కర్నూలును స్మార్ట్ సిటీ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు టీజీ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందితే పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ కర్నూలులో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని టీజీ విమర్శించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేస్తానంటోందని టీజీ చెప్పారు. జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అమిత్ షాని పవన్ ప్రశంసించడం సంతోషమే కానీ, తమతో కలిసి ఆయన పోరాడతారా? అనేదే అసలు ప్రశ్న అని టీజీ వెంకటేష్ అన్నారు.

Related posts