telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ‌ర‌స‌గా మూడో ఏడాది ఆ చెత్త రికార్డు ఢిల్లీ పేరిటే…!

వ‌ర‌స‌గా మూడో ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత క‌లుషిత రాజధానిగా ఢిల్లీ రికార్డు మూఠ గట్టుకుంది.. భారత్‌లో దేశ రాజధాని ఢిల్లీయే కాదు.. ప్రపంచంలోని టాప్ 30 సిటీల్లో ఏకంగా భారత్‌ నుంచి 22 నగరాలు ఉన్నాయంటే మన దేశంలో కాలుష్యం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కాలుష్యం చెత్త రికార్డుకు సంబంధించిన నివేదికను 2020 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వెల్లడించింది. అయితే, 2018, 2019ల‌తో పోలిస్తే కాలుష్యం త‌గ్గినా ప్రపంచంలోని మిగతా సిటీలతో పోలిస్తే.. భారత్‌లోని సిటీల్లోనే కాలుష్యం ఎక్కువగా నమోదైంది.. 106 దేశాల్లోని ప్రభుత్వాలు, ఇత‌ర ప్రైవేటు సంస్థలు సేక‌రించిన పీఎం 2.5 డేటా ఆధారంగా ఈ నివేదికన తయారు చేశారు.. కోవిడ్ ఎఫెక్ట్‌తో గత ఏడాది లాక్‌డౌన్ విధించడంతో.. కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గిపోయింది.. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం స్పష్టంగా కనబడింది.. భారత్‌లోనూ కాలుష్య స్థాయి పడిపోయింది.. ఫ్యాక్టరీలు, రవాణావ్యవస్థ.. ఇలా అన్నీ మూతపపడంతో.. కాలుష్యం తగ్గింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా సిటీలతో పోలిస్తే మాత్రం.. భారత్‌లోని సిటీల్లో కాలుష్యం తీవ్రంగానే ఉంది. చూడాలి మరి వచ్చే ఏడాది వరకైనా ఏమైనా మెరుగవుతుందా.. అనేది.

Related posts