ప్రధాని నరేంద్రమోడీ ప్రకటిన మేరకు దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. నిషేధం దిశగా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పర్యవరణ పరిరక్షణపై పలు కీలక సూచనలు చేశారు.
కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. పర్యావరణం సమతుల్యంపై చర్చించేందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో పర్యావరణంపై కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది.
లోకేష్ ఓ పప్పు.. అ ఆలు రావు: వైఎస్ షర్మిల