telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేమికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక రైలు… ఎక్కడో తెలిస్తే షాకే…!?

China

చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రేమికుల కోసం ఓ ప్రత్యేకమైన రైలు నడుపుతోంది. ఎందుకంటే చైనాలో ఇరవై ఏళ్లుగా పెళ్ళిళ్ల సంఖ్య బాగా తగ్గిపోయిందట. యువతీయువకులు ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించకుండా కెరీర్ గురించే ఆలోచిస్తుండటం వల్ల ప్రేమ, పెళ్లి వంటివాటికి దూరంగా ఉంటున్నారని ఈ ఆలోచన చేసింది చైనా ప్రభుత్వం. ప్రేమికుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రైలులో ఒక్కో విడతలో వెయ్యి మంది అమ్మాయిలు, అబ్బాయిలను రెండురోజులపాటు పర్యటనకు తీసుకెళ్తారు. ప్రయాణంలో ప్రత్యేక కార్యక్రమాలద్వారా వారిమధ్య పరిచయం పెరిగి, మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ పరిచయంలో యువతీయువకులు ఒకరిగురించి ఒకరు తెలుసుకుని ఆ పరిచయం ప్రేమగా మారాలని రైల్వేశాఖ ఈ వినూత్న ఆలోచనకు తెరలేపింది. వారు ఊహించినట్టుగానే ఇప్పటికే చాలా మంది ప్రేమపక్షులుగా మారిపోవడమే కాదు వివాహబంధంతో ఒక్కటైనవారూ ఉన్నారట.

Related posts