telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో హీరోపై వర్మ బయోపిక్ ?

RGV

వివాదాలు వర్మ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే ‘పవర్ స్టార్’ సినిమాతో చర్చనీయంశంగా మారాడు. “పవర్ స్టార్” అనే టైటిల్ తో “ఎన్నికల తర్వాత జరిగిన కథ” అంటూ ఈ రోజే విడుదల చేశారు. ఇదిలా ఉంటే వర్మ మరో హీరో బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అకాలమరణంతో అభిమానులను విషాదంలోకి నెట్టిన ఉదయ్ కిరణ్ జీవిత కథతో వర్మ సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్. సినిమా అవకాశాలు తగ్గడంతో డిప్రషన్ కు గురై ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కథను సినిమాగా తీయడానికి వర్మ సిద్దమయ్యారట. ఈ సినిమాలో కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని సమాచారం. తన సినిమాల్లో పాత్రలు చాలా రియలిస్టిక్జ్ గా ఉండేలా చూసుకునే వర్మ ఉదయ్ కిరణ్ ను పోలిన వ్యక్తి కోసం గాలిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వర్మ స్పందించాల్సిందే.

Related posts