telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

గుడ్ న్యూస్ : రెండే రెండు నిమిషాల్లో కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది..!

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.53 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.  ప్రతి రోజు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ఏ రంగాల వారిని వదలడం లేదు. ప్రతి ఒక్కరికీ సోకుతుంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవే కాక రిజల్ట్ వచ్చేందుకు సమయం పడుతుంది. ఈ లోపు ఒకవేళ నిజంగా వైరస్ ఉంటె మరి కొంత మందికి కరోనా సోకె ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిమిషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనుగొన్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనాను గుర్తించేలా ఒక పరికరాన్ని తయారు చేశారు చెన్నై కేజపక్కంలోని కేజే ఆస్పత్రి పరిశోధకులు. కేజే కోవిడ్ ట్రాకర్ పేరుతో పిలిచే ఈ డిజైన్ చూడటానికి ఒక చేయిలాగా ఉంటుంది. ఈ డిజైన్ సాయం తో బిపి, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్, రక్త కణాల సంఖ్య స్థాయిలను తెలుసుకోవచ్చు. ఆర్ టీ పీసీఆర్ కంటే పక్కాగా ఇది రిజల్ట్ ఇస్తుందని ఆ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

Related posts