telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగన అండగా నిలిచిన సందర్భం ఒక్కటీ లేదు… : తాప్సి

Kangana

బాలీవుడ్‌లో ప్రస్తుతం బంధుప్రీతి గురించి హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇన్‌సైడర్-అవుట్ సైడర్ అంటూ హీరోయిన్ కంగన లేవనెత్తిన అంశం గురించి అందరూ స్పందిస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కంగనా, తాప్సి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హీరోయిన్ తాప్సీ తాజాగా ఈ విషయం గురించి మాట్లాడింది. తనూ నెపోటిజం బాధితురాలినేనని తెలిపింది. “నేను కూడా నెపోటిజం బాధితురాలినే. స్టార్ వారసుల కోసం నన్నూ చాలా సినిమాల నుంచి తప్పించారు. ఆ విషయం తెలిసినా కంగన ఎప్పుడూ నాకు మద్దతుగా నిలవలేదు. నాకే కాదు.. కంగన ఎవరికీ ఎలాంటి సహాయమూ చేయదు. అవుట్ సైడర్ ఎవరికైనా కంగన అండగా నిలిచిన సందర్భం ఒక్కటీ లేదు. సుశాంత్ లాగానే నేనూ ఎవరి అండా లేకుండానే యుద్ధం చేశాన`ని తాప్సీ తెలిపింది. తన మాటలకు మద్దతు పలకని ఎవరినైనా కంగన శత్రువుగానే చూస్తుంది” అని తాప్సీ పేర్కొంది.

Related posts