telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇక్కడ ఫోన్ చూస్తూ రోడ్డు దాటితే అంతే సంగతులు…!!?

Road-Crossing

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఇకపై ఫోన్ చూస్తూ రోడ్ క్రాస్ చేస్తే జరిమానాలు తప్పవని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చూస్తూ రోడ్డు దాటడం వల్ల సంభవిస్తున్న ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర సెనేట్ ప్రత్యేకంగా దీనిపై ఓ బిల్‌ను ప్రవేశపెట్టింది. ఈ బిల్ ప్రకారం ఎవరైనా ఫోన్ చూస్తూ రోడ్డు క్రాస్ చేసి దొరికితే వారికి అధికారులు 25 నుంచి 50 డాలర్ల జరిమానా వేస్తారు. ఇది మొదటిసారి దొరికితే. మళ్లీ అదే వ్యక్తి 18 నెలలలోపు రెండోసారి ఇలాగే దొరికితే ఏకంగా 250 డాలర్లు ఫైన్ విధిస్తారు. ఒకవేళ నీవు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని అధికారుల ముందు నిరూపించుకోగలిగితే జరిమానా నుంచి తప్పించుకునే వెసులుబాటు కల్పించారు. ఏ పాదచారుడు కూడా ఒక్క మొబైల్ ఫోనే కాకుండా ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను చూస్తూ రోడ్డు దాటరాదని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. గతేడాదే ఈ బిల్‌ను ఫెలిక్స్ ఓర్టిజ్, డి-బ్రూక్లీన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా తాజాగా పూర్తి మద్దతు కూడగట్టుకుంది. ఇప్పటికే హవాయిలోని హోనోలులు, కాలిఫోర్నియాలోని మోంట్ క్లైర్‌, న్యూజెర్సీలో ఫోన్ చూస్తూ రోడ్డు దాటడాన్ని నిషేధించాయి. త్వరలోనే న్యూయార్క్‌ కూడా ఈ నగరాల జాబితాలో చేరబోతోంది.

Related posts