telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు

cm Jagan tirumala

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను రమణ దీక్షితులు ఇవాళ కలిసారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున సీఎం వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు అని.. వేల సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందన్నారు. ఈ మధ్య దానికి అడ్డంకులు ఏర్పడ్డాయి…సీఎం దీన్ని పునరుద్ధరించారని కొనియాడారు. వైఎస్ జగన్ వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ రద్దు చేశారని… ప్రతి పాలకుడిలో కూడా విష్ణు అంశ ఉంటుంది..దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. దానికి వైఎస్ జగన్ సనాతన దర్మానికి ఆటంకం కలిగినప్పుడు విష్ణుమూర్తిలా ధర్మాన్ని పునరుద్ధరించారన్నారు. సీఎం వైఎస్ జగన్ మరిన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి రాష్ట్రంలోని అర్చకులకు మేలు చేయాలని… దేవాలయాల్లో నిత్య నైవేద్యాలు, దూపదీపాలు ఆటంకం లేకుండా కొనసాగించాలని సీఎంని కోరామని తెలిపారు. మిరాశీ హక్కుల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు సౌందర్యరాజన్ కూడా పోరాడారని… మిరాశీ హక్కు రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ అని తెలిపారు. రాజులు ఎన్నో భూములు, ఆభరణాలు సమర్పించుకున్నారని.. వాటిని చేసే అర్చకులు ఆకలితో బాధపడకూడదని భూములు సమర్పించుకున్నారన్నారు. దీన్ని రాజకీయం చేయడం కూడా తగదని…చెట్టుకి పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజం…టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివే అన్నారు. ఎవరు రాజకీయాల్లో ఉన్నా విమర్శ చేస్తూనే ఉన్నారని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదని..వైఎస్సార్ హయాంలో కూడా ఇలానే దుష్ప్రచారం చేశారని తెలిపారు.

Related posts