తిరుపతి ఉపపోరు ప్రచారంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు… ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూనే, మరోవైపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే మిత్రపక్షమైన పవన్ కల్యాణ్ సిఎం అభ్యర్థి అంటూ ప్రకటించి ఎన్నికల బాధ్యతను జనసైనికుల భుజాన వేసిన బిజెపి, ఇప్పుడు పవన్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది. అంటే ఆ తర్వాత సరిగ్గా వారానికి ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన నేరుగా పోటీ చేయకపోయినా.. జనసేన మద్దతుతో బీజేపీ బరిలో ఉంది. అయితే.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను కమలనాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంతో ఊపందుకోగా.. తమ పార్టీ అగ్రనేతల ప్రచారంతో ప్లస్ పాయింట్ అవుతుందని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే పార్టీ చీఫ్ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ ప్రచారంలో పాల్గొంటారు. 12న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, 15న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తారు.
నిర్భయ నిందితులతో పాటే ఆమెను కూడా జైల్లో… కంగనా సంచలన వ్యాఖ్యలు