telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

శుభవార్త : భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. దీపావళి, పెళ్లిళ్లు ఉండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ. 50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. గఅయితే… తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. ఈరోజు భారీగా తగ్గాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 53, 830 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 49, 350 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గడంతో రూ. 51, 630 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గడంతో రూ.47, 300 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 200 పెరగడంతో రూ. 68,300కు చేరింది.

Related posts