telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రష్యా బాటలో యూఏఈ.. ఆరోగ్య మంత్రికి తొలి డోస్!

Corona Virus Vaccine

కరోనా నివారణకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకముందే ప్రజలకు రష్యా పంపిణీ చేయగా, యూఏఈ కూడా రష్యా బాటలో నడిచింది.

ఇటీవల వ్యాక్సిన్ ను కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ యోధులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలి విడత వ్యాక్సిన్ డోస్ దేశంలోకి అందుబాటులోకి వచ్చింది.

యూఏఈ ఆరోగ్య శాఖా మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్, ఈ వ్యాక్సిన్ తొలి డోస్ ను తీసుకున్నారు. దీని ట్రయల్స్ లో ఎలాంటి దుష్పరిణామాలూ సంబవించలేదని, ఈ కారణంగానే తాను టీకాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు.

దేశ ప్రజలను రక్షించడంలో తాము ముందుంటామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా ఇస్తామని అన్నారు.

Related posts