దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా… మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. అటు పోలీసులు, ఇటు చట్టాలు మహిళలపై దాడులు చేసే మృగాలను ఆపలేకపోతున్నాయి. దాడులు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించినా… మిగతా వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా.. మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ బస్ స్టాండ్ వద్ద కొత్తూరు వెళ్లేందుకు ఓ మహిళ (27) ఆటో ఎక్కింది. ఒంటరిగా ప్రయాణిస్తుందని భావించిన ఆటో డ్రైవర్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండువల్లి వద్దకు రాగానే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె అరుపులు, కేకలు వేసింది. దీంతో భయాందోళన చెందిన ఆటో డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
next post
ఉదయభాను కోసం బాబా మాస్టర్ స్టూడియోల చుట్టూ…!?