ఫ్రాన్స్‌లో న్యూడిస్ట్ విలేజ్‌గా పేరొందిన హెరాల్ట్‌లో గల నేచర్ రిసార్ట్ ‘కాప్ డిఎగ్డే’ (Cap d’Agde)లో హాలిడేస్ ఎంజాయ్ చేసిన నేచురిస్టులకు కరోనా వైరస్ అంటుకుంది. సుమారు 100కు పైగా నేచురిస్టులు ఈ రిసార్టులో నగ్నంగా తిరుగుతూ స్వేచ్ఛగా ప్రకృతితో మమేకమైపోయారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా మొండిగా తిరిగేశారు. కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా.. తమ నగ్నత్వాన్ని చూసి కరోనా దరిచేరదని భావించారు. కానీ అక్కడ సేద తీరుతున్న అందరికీ అంటుకుంది. ఆ రిసార్టులో ఇప్పటివరకు సుమారు 95 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌కు గురైనవారిలో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు, 65 ఏళ్లు పైబడినవారేనని తెలిసింది. ఫ్రాన్సులో ఇప్పటివరకు 280,000 మందికి కరోనా వైరస్ నిర్ధరణ కాగా, 30,518 మరణాలు చోటు చేసుకున్నాయి.
next post