telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

మధుమేహానికి .. కొర్రలతో చెక్ !

korralu as food to overcome diabetic

జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమని నమ్ముతున్నారు. అందుకే నాలుకను కాస్త కంట్రోల్‌లో ఉంచుకుని ఆరోగ్యవంతమైన ఆహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది నోట వినబడుతున్న మాట కొర్రలు. మరి ఈ కొర్రల్లో ఏం ప్రత్యేకత ఉందో చూడండి.

గింజ తరహా ఆహారంలో సాధారణంగా ఆరోగ్యం చేకూరుతుంది అని ఇటీవల చాలా మంది వాటివైపు తమ దృష్టిని సారిస్తున్నారు. అందులో మహారాజా వంటి కొర్రలు ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తాయి.

మధుమేహాన్ని నియంత్రించిడంలో కొర్రలు చురుకైన పాత్రను పోషిస్తాయి.. ఇంతకు ముందు తరాల వాళ్ళు డయాబెటిస్ బారిన పడలేదంటే అదంతా కొర్రల చలువేనట. కొర్రలను తినాలంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందిగా అనిపిస్తుందట.

Finger millet and its importance in foodఅందుకని మొత్తం ఒక్కసారిగా కొర్రలతో భర్తీ చేయడం సాధ్యం కాదు, మంచిది కూడా కాదు. అందుకే మామూలు బియ్యంలో గుప్పెడు కొర్రలను వేసి అన్నం చేసుకుని తింటే మంచి గుణం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.

కొర్రల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందట. దీనితో సులువుగా జీర్ణమైపోతుంది. కొర్రలు జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తాయి. కొర్రలలో ప్రొటీన్లు 11 శాతం ఉంటాయి.

కొర్రలతో చేసిన ఆహారం తింటే క్రొవ్వు పెరిగే సమస్య అసలు ఉండదంటున్నారు వైద్యులు.

శరీరంలో జీర్ణక్రియలు సరిగ్గా నడిపించే శక్తి ఈ తృణధాన్యాలకు ఉంటుంది. అందుకే కొర్రలను ఖచ్చితంగా వాడండి అంటున్నారు వైద్య నిపుణులు.

Related posts