telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పామును పట్టుకున్న హైదరాబాద్ సీపీ

Hyd cp snake

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఓ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన తన కారును ఓ ప్రదేశంలో నిలిపి నడక సాగిస్తున్నారు. కారు వద్ద ఉన్న పెంపుడు కుక్క అదేపనిగా అరుస్తుండడంతో ఆయన కారు వద్దకు వెళ్లారు.

దేన్ని చూసి కుక్క అరుస్తోందని ఆయన అన్ని వైపులా పరిశీలించగా అక్కడ ఓ పాము కనిపించింది. వెంటనే తన సిబ్బంది సాయంతో అంజనీ కుమార్ స్వయంగా ఆ పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని నెహ్రూ జూ పార్క్ సిబ్బందికి అప్పగించారు. పాములు కనిపించినప్పుడు తొందరపాటుతో వాటిని చంపరాదని తెలిపారు. పాములు సైతం పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తుంటాయని అంజనీ కుమార్ వివరించారు.

Related posts