telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేవలం ముగ్గురు కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది..

Rahul gandhi congress

బీజేపీ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. “కరోనా” వచ్చినపుడు ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా వ్యవసాయ చట్టాల వల్ల దేశం నష్టపోతుందని హెచ్చరిస్తున్నానని తెలిపారు. ప్రధాని వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే రైతులకు నష్టం కాదని.. యావత్ దేశానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, యువత ఉపాధి కోల్పోతారని…. దేశంలో కోట్ల మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. రైతుల ఆందోళనను విరమింపజేసే ప్రయత్నాలే ప్రభుత్వం చేస్తోంది కానీ రైతుల గోడు మాత్రం వినట్లేదని… రైతుల గోడును రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేవలం ముగ్గురు కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని ఫైర్‌ అయ్యారు. దేశంలో వ్యవసాయంపై రైతులు పెట్టిబడి పెడతారు…లాభాలు కార్పొరేట్లు తీసుకుంటారని… దేశంలో ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాల ఆమోదం సరైన పద్దతిలో జరగలేదన్నారు.

Related posts