పోలీసులు వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు సీనియర్లలో ఒకరిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర గడ్చిరౌలి ప్రాంతంలోని జలగాన్ జిల్లాకు చెందిన డాక్టర్ పాయల్ తాడ్వి(26) ముంబయిలోని బీవైఎల్ నాయర్ ఆస్పత్రిలో గైనకాలజీ పీజీ చదువుతుంది. ఎస్టీ వర్గానికి చెందిన ఈమెను తన సీనియర్లు ముగ్గురు కులం పేరుతో వేధింపులకు గురిచేశారు.
తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా సీనియర్లలో ఒకరిని అరెస్ట్ చేశారు.
కంగన అండగా నిలిచిన సందర్భం ఒక్కటీ లేదు… : తాప్సి