telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బాత్రూమ్ కమోడ్ పై 116 గంటలుగా… ఎందుకంటే…?

Man

బెల్జియంకు చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తి తన రోజువారి కార్యక్రమాలన్నీ టాయిలెట్ కమోడ్‌పై నుంచే చేస్తున్నాడు. తినడం, తాగడం, నిద్రపోవడం, ఇంటికి ఎవరైనా వస్తే వారితో మాట్లాడడం ఇలా అన్ని దానిపైనే చేస్తున్నాడు. అతడే బెల్జియంకు చెందిన జిమ్మీ డీ ఫ్రెన్నె అనే అతను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం కోసమే ఇదంతా చేస్తున్నాడు. ప్రపంచ రికార్డ్ కోసమే జిమ్మీ ఈ వింత పనికి పూనుకున్నాడు. ఇప్పటి వరకు అతడు నిర్విరామంగా 116 గంటలు ఇలా టాయిలెట్ కమోడ్‌పైనే గడిపాడు. అయితే, గంటకు ఐదు నిమిషాల పాటు జిమ్మీ దాని మీద నుంచి లేచి అటు ఇటు తిరిగిరావడం చేస్తున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు వేరే వ్యక్తి పేరిట 165 గంటలుగా ఉంది. ప్రస్తుతం జిమ్మీ దాన్ని అదిగమించే పనిలో ఉన్నాడు. కాగా జిమ్మీ ప్రయత్నం గురించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఇంకా ఈ విషయంపై స్పందించనేలేదు.

Related posts