telugu navyamedia
క్రైమ్ వార్తలు

టాలీవుడ్‌లో మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు మృతి

తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే శివశంకర్‌ మాస్టర్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

తెలుగులో రెండు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ కిరణ్​ అబ్బవరం త‌మ్ముడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా చెన్నూరు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్​ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

telugu hero kiran abbavaram brother died

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ‘ఎస్​.ఆర్. కల్యాణ మండపం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మ‌రో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన సోదరుడు కన్నుమూయడం అతడికి అతిపెద్ద లోటే అని చెప్పాలి.

Related posts