telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

మనకి ఐరన్ .. ఎంత అవసరమో తెలుసా… !

iron requirement for all ages needs to knowa

మ‌న శ‌రీరంలో ఉన్న ప్ర‌తి ఒక్క క‌ణానికి ఆక్సిజ‌న్ అందాలంటే.. అందుకు ఐర‌న్ ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. ఐర‌న్ స‌హాయంతో ర‌క్తంలో ఉన్న ఆక్సిజ‌న్ క‌ణాలకు చేరవేయ‌బ‌డుతుంది. అయితే ఐర‌న్ లోపిస్తే.. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం మ‌నం ఐర‌న్ పుష్క‌లంగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవాలి. దీనితో ఐర‌న్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

అప్పుడే పుట్టిన పిల్ల‌ల నుంచి 6 నెల‌ల వ‌యస్సు ఉన్న పిల్ల‌ల‌కు నిత్యం 0.27 మిల్లీగ్రాముల ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది.

7 నుంచి 12 నెల‌ల వ‌య‌స్సున్న చిన్నారుల‌కు నిత్యం 11 మిల్లీగ్రాములు,

1 నుంచి 3 సంవ‌త్స‌రాల వ‌యస్సు ఉన్న పిల్ల‌ల‌కు 7 మిల్లీగ్రాములు,

4 నుంచి 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ వారికి 10 మిల్లీగ్రాములు,

9 నుంచి 13 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌వారికి 8 మిల్లీగ్రాములు,

14 నుంచి 18 ఏళ్ల వారిలో మ‌గ‌వారికి 11 మిల్లీగ్రాములు,

ఆడ‌వారికి 15 మిల్లీగ్రాములు,

19 నుంచి 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌వారిలో మ‌గవారికి నిత్యం 8 మిల్లీగ్రాములు, ఆడ‌వారికి నిత్యం 18 మిల్లీగ్రాముల ఐర‌న్ అవ‌స‌రం

51 ఏళ్ల పైబ‌డిన వారికి నిత్యం 8 మిల్లీగ్రాముల ఐర‌న్ కావాలి.

iron requirement for all ages needs to knowaఐర‌న్ అనేక కూర‌గాయ‌ల‌తో పాటు మాంసాహారంలోనూ ల‌భిస్తుంది. టమాటాలు, పాల‌కూర‌, మున‌గాకు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, న‌ట్స్, కోడిగుడ్లు, సోయా, జీడిప‌ప్పు, మ‌ట‌న్‌, మ‌ట‌న్ లివ‌ర్‌, రొయ్య‌లు.. త‌దిత‌ర ఆహారాల్లో మ‌న‌కు ఐర‌న్ ఎక్కువగా ల‌భిస్తుంది. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా ఐర‌న్ లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు.

Related posts